యూపీలోని బరేలీలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీస్ జీప్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న కానిస్టేబుల్ శుభం భరద్వాజ్ అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. శబ్ధం విని హుటాహుటిన జీపు వద్దకు చేరుకున్న సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.