యూపీలోని ఎటా-కొత్వాలి నగర్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళపై కోర్టు ఆవరణలోనే దాడి జరిగింది. బాధితురాలిని జుట్టు పట్టుకుని లాగి చితక్కొట్టారు. తనను కొట్టిన వారు అత్తమామలు అని బాధితురాలు పేర్కొంది. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, తాను కేసు పెట్టడంతో తనపై దాడి చేశారని ఆరోపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa