ప్రధాని మోదీకి మేఘాలయ ప్రభుత్వం షాకిచ్చింది. ఫిబ్రవరి 24న సంగ్మా స్టేడియంలో నిర్వహించే ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించింది. ఈ స్టేడియంలో ఇంకా పనులు పూర్తి కాలేదని, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా అక్కడే ఉందని పేర్కొంది. ప్రధాని సభకు జనం భారీగా తరలివస్తారు కాబట్టి ఈ మైదానానికి ఆ సామర్థ్యం లేదని, మెటీరియల్ కు భద్రత ఉండదని వివరణ ఇచ్చింది. మోదీ సభకు వేదికను మార్చుకుంటే అనుమతిస్తామని మేఘాలయ క్రీడా శాఖ చెప్పింది.