అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాకు షాకిచ్చారు. అకస్మాత్తుగా ఆయన ఉక్రెయిన్ లో ప్రత్యక్షమయ్యారు. కీవ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రష్యా కారణంగా మరణించిన సైనికుల స్మారకం వద్ద నివాళులర్పించారు. రష్యా-ఉక్రెయిన్ వార్ ప్రారంభమై ఏడాది అయింది. రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో బైడెన్ అకస్మాత్తుగా ఉక్రెయిన్లో పర్యటించడం కలకలం రేపుతోంది. మరి దీనిపై పుతిన్ ఎలా స్పందిస్తారో?