విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి పలువురు కార్యాలయంకు విచ్చేసి తమ సమస్యలను కెకె రాజు కి స్వయంగా వచ్చి విన్నవించారు. వారి వద్ద నుండి సంబంధిత వినతి పత్రాలు, దరఖాస్తులు తీసుకుని అధికారులతో మాట్లాడి కొన్ని వెంటనేపరిష్కరించారు. మరికొన్ని సంబంధిత అధికారులకు రిఫర్ చేసి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.