అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మైదుకూరు ఇందిరమ్మ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు మాతృభాష ఆవిష్కరణ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించాలని ఇతర దేశాలలో ఉన్నప్పటికీ తన మాతృభాషను గౌరవించాలని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు.