గిరిజన సహకార సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని ఎపి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం గుమ్మలక్ష్మీపురం జిసిసి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎపి గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మండంగి రమణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కోలక అవినాష్ మాట్లాడుతూ గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలను కల్పించాలని కోరారు. కిలో చింతపండు రూ. 50కు కొనుగోలు చేయాలన్నారు.