దేశంలో మహిళల పట్ల ఆకతాయిల వేధింపులు కొనసాతూనే ఉన్నాయి. ఈ వేధింపులకు కొందరు మహిళలు భయపడితే, మరికొందరు మాత్రం ధైర్యంగా ఎదిరిస్తారు. తాజాగా ఇలాంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ ఆకతాయి మహిళను వేధించగా, ఆ మహిళ వెంటనే చెప్పుతో ఆకతాయిని చితకబాదుతుంది. దీంతో ఆ ఆకతాయి పారిపోతాడు. ఈ ఘటన యూపీ హత్రాస్ లోని సదర్ కొత్వాలి ప్రాంతంలో జరిగింది.