ఓ డి చెరువు మండలం వణుకువారిపల్లి లో ఎస్సై గోపి ప్రజలతో సమావేశమై సైబర్ నేరాలు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్కరికి కూడా తమ ఏటీఎం కార్డు పిన్ నెంబర్లు తెలియజేయకూడదని చెప్పారు. బ్యాంకు అధికారులమని చెప్పి కొందరు ఓటిపి చెప్పాలని ఫోన్ చేసినా చెప్పకూడదని సూచించారు. అదేవిధంగా ఏటీఎం సెంటర్లలో నగదు విత్ డ్రా చేసుకునే సమయంలో చాలా మెలకువగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా సైబర్ నేరాలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.