బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్టుకు దూరమైన వార్నర్, ఇప్పుడు సిరీస్ మొత్తానికి దూరమైనట్లు సమాచారం. మోచేతికైన ఫ్రాక్చర్ నుండి కోలుకోకపోవడమై దీనికి కారణంగా తెలుస్తోంది. వార్నర్ చికిత్స కోసం ఆస్ట్రేలియాకు వస్తాడని, మళ్లీ వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండొచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.