ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్న రేషన్ బియ్యం బదులు రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ సక్సెస్ అయితే.. దశల వారీగా రాష్ట్రమంతటా ఈ విధానం అమలుకానుంది. రాగులు, జొన్నలకు సంబంధించి ఇప్పుటికే ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. మెజార్టీ ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు.