నూతనంగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఎస్ఏ 16 శాతానికి పెంచాలని జిల్లా ఎన్టీవో అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి డిమాండు చేశారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనంత జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులతో సమానంగా హెచ్ఎస్ఏ అందించాలని కలెక్టర్ బసంత్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. నూతనంగా ఏర్పడిన జిల్లాకు రావడంతో హెచ్ఎస్ఏ 16 శాతం నుంచి. 10 శాతానికి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో పని చేస్తున్న అన్ని శాఖల ఉద్యోగులకు 16 శాతం అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు హాజరు విధానాన్ని మినహా యింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు లింగారామ్మోహన్, తాలూకా కార్యదర్శి శ్రీనివాసులు, కదిరి, హిందూ పురం తాలూకా అధ్యక్షులు వేణు, నరసింహులు, జిల్లా మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు జమిలాబేగం, ఉపాధ్యక్షురాలు రాజే శ్వరిదేవి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.