పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫోన్ కు బానిసలే. ముఖ్యంగా అమ్మాయిలు ఫోన్ లో లీనమయ్యారంటే ప్రపంచాన్నే మరిచిపోతారు. అందుకే ఈ విషయంలో గుజరాత్ లోని ఠాకూర్ కమ్యూనిటీ కఠిన నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలు ఫోన్ వాడకంపై నిషేధం విధించింది. ఫోన్ల వల్ల లవ్ ఎఫైర్లు, కులాంతర వివాహాలు పెరిగిపోతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే ఎంగేజ్ మెంట్ కు 11 మంది మాత్రమే రావాలని, పెళ్లికి డీజే సిస్టమ్ కూడా వినియోగించవద్దని నిర్ణయించారు.