ఇటీవల బెంగళూరులో జరిగిన వార్షిక ఏరో ఇండియా షోలో 'ఇప్లేన్' కంపెనీ తన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ నమూనాను ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేషన్ పై ఓ వీడియో చూసిన తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని నిర్మించాలనే ఆలోచన వచ్చిందని ఈ కంపెనీ సహ వ్యవస్థాపకులు ప్రాంజల్ మెహతా, సత్య చక్రవర్తి తెలిపారు. వీరిద్దరూ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు. 2017లో ePlane ని స్థాపించారు. దాదాపు 200 కిలోల బరువున్న ఈ టాక్సీ ఒకే రైడ్‌లో ఇద్దరు ప్రయాణీకులను తీసుకెళ్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కి.మీ.