లవ్ జీహాద్ ను మనం ఎదుర్కోవాలంటే ఒకటికి పది రెట్లు మనం ముందు ఉండాలని శ్రీరామసేన చీఫ్ పిలుపునిచ్చారు. లవ్ జీహాద్ పేరుతో ఒక్క ముస్లీం యువకుడు ఓ హిందూ యువతిని పెళ్లి చేసుకుంటే ఓ హిందూ యువకుడు పది మంది ముస్లీం అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి సిద్దం కావాలని, ఆ ప్రయత్నాలు చెయ్యాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలావుంటే ప్రమోద్ ముతాలిక్, ఈ పేరు కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. శ్రీరామసేన వ్యవస్థాపకుడు అయిన ప్రమోద్ ముతాలిక్ హిందూ యువకులను ఆకర్షించి ప్రసంగాలు చెయ్యడంలో దిట్ట. అంతే కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి యువతను రెచ్చగొడుతున్నాడని ప్రమోద్ ముతాలిక్ మీద అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రమోద్ మతాలిక్ మాత్రం హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవాలని హిందువులకు పిలుపునిస్తున్నారు.