ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని కేంద్ర గ్రామీణ గృహనిర్మాణం (రూరల్ హౌసింగ్) డైరెక్టరు శైలేష్ కుమార్ ఆదేశించారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించేందుకు శైలేష్ కుమార్ సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని గృహనిర్మాణశాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందజేస్తామని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇంకా ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపిస్తే.. వెంటనే అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో గృహనిర్మాణం అమలు తీరుపై హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి.లక్ష్మీషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశం అనంతరం శైలే్‌షకుమార్ క్షేత్రస్థాయి పరిశీలనకు ఏలూరు వెళ్లారు.