పాఠశాలల నిర్వహణ కోసం ఇచ్చే కాంపోజిట్ గ్రాంట్‌లో 20శాతం నిధుల విడుదలకు సమగ్రశిక్ష ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఎస్పీడీ సురేశ్‌కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. 44,482 పాఠశాలలకు 23.71 కోట్లు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకూ ఒక విడతలో 20శాతం నిధులు ఇవ్వగా, ఇప్పుడు రెండో విడత కింద మరో 20 శాతం ఇస్తున్నారు. ఇంకా 60శాతం నిధులు విడుదల చేయాల్సి ఉంది. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇంకా సగం నిధులు కూడా ఇవ్వకపోవడంపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.