రణస్థలం పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మత్స్య కారుడు అంబటి చిన్నారావు(48) తెప్పబోల్తాపడిన ఘటన లో మృతి చెందారు.వివరాల్లోకి వెళ్ళితే ...... ఆదివారం ఉదయం సముద్రంలో చేపల వేట కోసం అదే గ్రామానికి చెందిన నలుగురితో కలిసి చిన్నారావు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా తీరానికి సమీపంలో అలల తాకిడికి తెప్ప బోల్తా పడింది. దీంతో తెప్పకింద చిక్కుకున్న చిన్నారావు మృతి చెందారు. చిన్నారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.