ఉత్తరప్రదేశ్లోని గోండాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పదిమంది కలిసి ఓ మహిళను విపరీతంగా చితకబాదారు. ఉమ్మివేయడాన్ని ప్రశ్నించినందుకు మహిళపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మహిళ జుట్టుపట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఓ వర్గం ఆమెను కొట్టారు. ఆపడానికి ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు స్థానికులు.