ముంబై భవనంపై నుంచి దూకి యూపీ టూరిజం డిప్యూటీ డైరెక్టర్ మృతి చెందారు ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ విమ్లేష్ ఆడిచ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు ఫిబ్రవరి 21న తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆడిచ్య ఈరోజు ముంబైలోని తిలక్ నగర్ ప్రాంతంలో భవనంపై నుంచి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు. తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.