గన్నవరంలో జరిగిన ఘర్షణలపై తెలుగుదేశం నేత పట్టాభిరామ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్టును సమర్పించారు.పట్టాభి స్పందిస్తూ.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపారు.