ఓ విస్మయానికి గురిచేసే నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. బారత్‌లో ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో పాటే ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం, రోడ్డు ప్రమాదాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ప్రపంచంలో అత్యంత చెత్త డ్రైవర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ టాప్-5లో నిలిచింది. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ కంపేర్ ద మార్కెట్ ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వరస్ట్ డ్రైవర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్‌కు నాలుగో ర్యాంక్ కేటాయించింది నివేదిక. అయితే, ఇందులో జపాన్ బెస్ట్ డ్రైవర్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.
ప్రపంచంలో అత్యంత చెత్త, బెస్ట్ డ్రైవర్లు ఉన్న జాబితాను సిద్ధం చేసేందుకు ఈ కంపెనీ సుమారు 50 దేశాలపై పరిశోధన చేసింది. కచ్చితమైన సమాచారం మేరకు ఈ జాబితాను సిద్ధం చేసినట్లు పేర్కొంది. అందులో ట్రెండ్స్, ట్రాఫిక్ అవార్నెస్, ట్రాఫిక్ ఆందోళనలు వంటి వాటిపై బేరీజు వేసింది. ఎందుకంటే డ్రైవింగ్ నైపుణ్యాన్ని అంచనా వేయడం అంత సులభమైన విషయం కాదు. మరోవైపు.. రోడ్ల పరిస్థితులు, స్పీడ్ లిమిట్, చట్ట పరమైన ఆల్కాహాల్ లెవెన్స్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత చెత్త డ్రైవర్లు ఉన్న దేశంగా తొలి స్థానంలో థాయిలాండ్ నిలించింది. ఆ తర్వాత రెండో స్థానంలో పెరూ ఉండగా మూడోస్థాన్ని లెబనన్ తీసుకుంది. వాటి తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. భారత ట్రాఫిక్ నిబంధనలు, అమలు చేయడం చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఈ జాబితాలో జపాన్ 4.57 పాయింట్లు సాధించగా భారత్ కేవలం 2.34 పాయింట్లు మాత్రమే సాధించింది. జపాన్ తర్వాత బెస్ట్ డ్రైవర్లు ఉన్న దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. మూడో స్థానంలో నార్వే నిలవగా ఈస్తోనియా నాలుగో ర్యాంక్ సాధించింది. ఐదో ర్యాంక్‌తో టాప్-5లో స్వీడన్ నిలిచింది.
మరోవైపు.. సుదూర ప్రాంతాల జర్నీలకు సంబంధించిన ట్రావెల్ ట్రెండ్స్ వార్షిక ఇండెక్స్‌ను రైడింగ్ విత్ ఇంటర్‌సిటీ పేరుతో విడుదల చేసింది ఉబర్. ఈ ఏడాది అత్యధికంగా గత శనివారమే ఇంటర్‌సిటీ ట్రావెల్స్ బుకింగ్స్ నమోదైనట్లు పేర్కొంది. ఈ జాబితాలో టాప్ టూరిస్ట్ ప్రాంతాలు, ప్రముఖ ఆఫ్‌బీట్ రూట్లు వంటి వాటిని పేర్కొంది.