మందుబాబులకు ఓ అరుదైన శిక్షను కోర్టు విధించింది. ఇదిలావుంటే వైజాగ్ నగరంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసులు 52 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి వారికి ఆసక్తికరమైన శిక్ష విధించారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయడమే మీకు విధిస్తున్న శిక్ష అని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని స్పష్టం చేశారు. దాంతో, పోలీసులు ఆ మందుబాబులను తీసుకుని బీచ్ కు వచ్చి, వారితో చెత్త ఏరివేత కార్యక్రమం షురూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.