మూడువందల కిలోమీటర్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పూర్తిచేసుకొంది. 23వ రోజు ఈ పాదయాత్ర 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీలో యువగళం పాదయాత్ర మంగళవారం 300 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ పంచాయతీ పరిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే రక్షిత మంచి పథకాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఏర్పాటు చేస్తానని లోకేశ్ ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభం అయ్యాక ప్రతి 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోగానే, లోకేశ్ ఏదో ఒక పథకంపై ప్రజలకు స్పష్టమైన ప్రకటన చేయడాన్ని ఆనవాయతీగా మార్చుకున్నారు.
యువగళం పాదయాత్ర 24వ రోజు షెడ్యూల్(22-2-2023)
ఉదయం
8.00 – కోబాక విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం.
8.45 – కొత్త వీరాపురంలో స్థానికులతో మాటామంతీ.
మధ్యాహ్నం
12.00 - మడిబాకలో రైతులతో ముఖాముఖి సమావేశం.
1.00 – మడిబాకలో భోజన విరామం.
సాయంత్రం
3.30 – మునగలపాలెంలో స్థానికులతో సమావేశం.
4.40 – వికృతమాలలో స్థానికులతో మాటామంతీ.
5.45 – పాపానాయుడుపేటలో కైకాల సామాజిక వర్గీయులతో ముఖాముఖి.
6.40 – రేణిగుంట మండలం జీలపాలెం విడిది కేంద్రంలో బస.