ఏపీలోని ఇంటర్ విద్యార్థులు, లెక్చరర్లకు వ్యక్తిక్త వికాసం, నైపుణ్యాలు అందించేందుకు ఇంటర్ విద్యామండలితో ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా లెక్చరర్లు, విద్యార్థులకు ఎన్ఆర్ఐ వైద్యులు ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వనున్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి అవసరమైన సూచనలు, టైమ్ మేనేజ్ మెంట్ తదితర అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తారు.