ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, రామ్‌గఢ్, ఛత్రా, లోహర్‌దగ్గా, రాంచీ జిల్లాల్లో ఓ ఏనుగు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ ఏనుగు గత 12 రోజుల్లో 16 మందిని పొట్టనపెట్టుకుంది. వీరందరినీ ఒకే ఏనుగు చంపిందా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు అధికారులు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏనుగు బీభత్సంతో ఇట్కీ ప్రాంతంలో అధికారులు 144 సెక్షన్ విధించారు. కాగా, ఝార్ఖండ్‌లో ఐదేళ్లలో 462 మంది ఏనుగుల దాడుల్లో మరణించారు.