రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొని మరో రూ.2,000 కోట్ల రుణం సమీకరించింది. ఏడేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు, మరో పదేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7.71 శాతం వడ్డీతో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన అనుమతుల్లో మరో రూ.929 కోట్ల రుణం తీసుకునేందుకు అవకాశం ఉంది.