కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పెళ్లిళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇంతవరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదని, కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు కావాలని ఉందని చెప్పుకొచ్చారు. పెళ్లిళ్లకు తాను వ్యతిరేకం కాదని, సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని రాహుల్ తెలిపారు. అలాగే కాంగ్రెస్ జోడో యాత్ర ముగిసే వరకు గడ్డం గీసుకోరాదని అనుకున్నారట.