రైల్వే ట్రాక్లు, సెల్ఫోన్ టవర్ల చోరీ ఘటనలు వినే ఉంటాం. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన బస్సునే దుండగులు ఎత్తుకెళ్లారు. కల్యాణ కర్ణాటక రవాణాసంస్థ (KKRTC) బస్సు చోరీకి గురైంది. కలబురిగి జిల్లా చించోళి బస్టాండ్లో బీదర్ డిపో–2కు చెందిన బస్ను సోమవారం రాత్రి నిలిపారు. మంగళవారం తెల్లవారుజామున బస్సును దుండగులు అపహరించారు. ఈ బస్సు కోసం అధికారులు గాలింపు చేపట్టారు.