ఇటీవల కాలంలో ప్రేమ జంటలు రోడ్డుపై హద్దుమీరి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ ప్రేమజంట బైక్ పై ప్రయాణిస్తూ రొమాన్స్ చేశారు. యువతి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని యువకుడ్ని ఆలింగంనం చేసుకుంటుంది. ఈ ఘటన యూపీలోని హార్దోయ్ ప్రాంతంలో జరిగింది. బైక్ నెంబర్ ఆధారంగా ఆ జంటపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.