బిహార్లోని సీతామర్హిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిట్టా గ్రామంలో ఇటీవల ముఖేష్ సాహ్ని అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో హంతకులను శిక్షించాలంటూ యువకుడి మృతదేహంతో స్థానికులు నిరసన చేపట్టారు. సర్ది చెప్తున్న పోలీసులపై ఆగ్రహించిన గ్రామస్థులు వారిపై రాళ్ల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని ధ్వసం చేశారు. దీంతో పోలీసులు పారిపోయి ఇళ్లలో దాక్కున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశారు.