అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, వడ్డీ రేట్ల పెంపు భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 302 పాయింట్ల నష్టంతో 60,370 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు నష్టపోయి 17,739 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.82 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క సన్‌ఫార్మా మాత్రమే లాభాల్లో ఉంది.