జననాల రేటును పెంచేందుకు చైనా సరికొత్త ప్రయోగాలను అనుసరిస్తుంది. తాజాగా కొన్ని చైనా ప్రావిన్స్‌లు వివాహాలను ప్రోత్సహిస్తూ, జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో కొత్తగా పెళ్లి అయిన వారికి 30రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాయి. చైనాలో సాధారణంగా వివాహం చేసుకుంటే మూడు రోజులే సెలవులు ఇస్తారు. కానీ ఫిబ్రవరి నుంచి కొన్ని ప్రావిన్సుల్లో 30 రోజులు సెలవులు ఇవ్వడంతో పాటు, ఆ నెల జీతం కూడా చెల్లిస్తున్నారు.