మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక్కే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అహ్మద్‌నగర్-పుణె హైవేపై మంగళవారం మధ్యాహ్నం కంటైనర్ ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలిక సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa