నిమ్మకాయలో ఉండే విత్తనాలతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి. వీటిని నీళ్లలో వేసి మరిగించి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. లివర్, కిడ్నీలు శుభ్రమవుతాయి. ఈ విత్తనాలను పెనంపై వేయించి తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు పోతాయి.