ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ

international |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 11:37 AM

జపాన్‌లోని గున్మా ప్రిఫెక్చర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినాకామి పట్టణంలోని కనేట్సు ఎక్స్‌ప్రెస్‌వేపై మంచు కారణంగా నియంత్రణ తప్పి సుమారు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 77 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా, మరో 26 మంది గాయపడ్డారు. మంచుతో నిండిన రోడ్లపై ముందుగా కొన్ని వాహనాలు జారిపోగా.. వెనుకాల వచ్చిన వాహనాల బ్రేకులు పడకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa