కోడిగుడ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, డి, ఇ, కె, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో కూడా అనేక పోషకాలున్నాయి. ఇది మెదడు అభివృద్ధికి, కంటిచూపు మెరుగుపరచడానికి, శరీర బరువు నియంత్రణకు, ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. అయితే, పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. గుండె జబ్బులు, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు, వ్యాయామం చేయనివారు దీనిని తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.