ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకంగా 8.10 శాతం ఆఫర్,,,, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ పెంచిన 4 బ్యాంకులు

business |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 10:02 PM

గత ఏడాది నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లలో భారీ కోత పెట్టాయి. అయితే ఈ మార్చి, 2026లో పలు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. ఎంపిక చేసిన టెన్యూర్లపై వడ్డీ రేట్లు పెంచాయి. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.10 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. సవరించిన కొత్త వడ్డీ రేట్లను ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చాయి. మరి ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకుందాం.


సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్


సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తమ బ్యాంకులో రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లను మార్చి 6, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. 5 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపు 10 బేసిస్ పాయింట్లు పెంచి జనరల్ కస్టమర్లకు 7.90 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే ఏకంగా 8.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.


 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైంత రూ.3 కోట్లలోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లను మార్చి 6 నుంచే అమలు చేస్తోంది. ఈ రివిజన్ తర్వాత జనరల్ కస్టమర్లకు 2.75 శాతం నుంచి 6.50 శాతం వడ్డీ ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. గరిష్ఠ వడ్డీ రేటును 3 ఏళ్ల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల టెన్యూర్ స్కీమ్ ద్వారా ఆఫర్ చేస్తోంది.


యెస్ బ్యాంక్


యెస్ బ్యాంకులోనూ రూ.3 కోట్లలోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించారు. కొత్త వడ్డీ రేట్లను మార్చి 5, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు జనరల్ కస్టమర్లకు 3.25 శాతం నుంచి 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఇస్తున్నారు. గరిష్ఠ వడ్డీ రేటును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్ డిపాజిట్లకు ఇస్తున్నారు.


బంధన్ బ్యాంక్


బంధన్ బ్యాంకులో రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించారు. సవరించిన కొత్త వడ్డీ రేట్లను మార్చి 5, 2026 నుంచే అమలు చేస్తున్నారు. ఈ సవరణ తర్వత జనరల్ కస్టమర్లకు 2.95 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ ఇస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.70 శాతం నుంచి 7.75 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. గరిష్ఠ వడ్డీ రేటును 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ కల్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa