పరీక్షా కేంద్రాల్లోకి హిజాబ్ తో అనుమతించాలంటూ కర్ణాటకకు చెందిన పలువురు విద్యార్థినులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 9 నుండి ప్రీ యూనివర్సిటీ పరీక్షలు ప్రారంభం కానుండడంతో అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా, కోర్టు అంగీకరించింది. కాగా, కర్ణాటకలోని ప్రభుత్వ కాలేజీల్లో హిజాబ్ పై నిషేధం అమలులో ఉంది. పిటిషనర్ల పరీక్ష జరిగే సెంటర్లు ప్రభుత్వ కళాశాలల్లో పడిన నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించారు.