విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో సుమారు 300 టన్నులకు పైగా ద్రవ ఉక్కు నేలపాలైంది. కర్మాగారంలోని బ్లాస్ట్ ఫర్నెస్ విభాగం నుంచి స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)-2కి రైలు ఇంజిన్తో టార్పిడో లాడిల్ కార్-4 ద్వారా తరలిస్తుండగా లాడిల్కు రంధ్రం ఏర్పడి ద్రవ ఉక్కు కారిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ట్రాక్ స్వల్పంగా దెబ్బతినగా, పునరుద్ధరిస్తున్నారు.