దేశవ్యాప్తంగా స్టీల్ కార్మికులకు అక్టోబర్ 21 నూతన వేతన ఒప్పందం జరిగింది. ఒప్పంద సమయంలో ఎన్ జె సి ఎస్ కన్వీనర్ గా మీరు ఉన్నారు. ఎన్జేసిఎస్ లో భాగస్వామ్యం గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులకు నూతన వేతనాలు నేటి వరకు అమలు చేయలేదు. దీనిపై కన్వీనర్ గా దృష్టి సారించి తక్షణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు నూతన వేతనాలు అమలు చేసే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంకు తగు సూచనలతో కూడిన ఆదేశాలను ఇవ్వాలని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ జాతీయ కార్యదర్శి లలిత్ మిశ్రా డిమాండ్ చేశారు.
ఈ మేరకు అయిన ఎన్ జే సి యస్ కన్వీనర్ కు లేఖ రాశారు. ఆ వినతిపత్రాన్ని మంగళవారం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ప్రతినిధులు స్టీల్ సీఎండీ కి ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ మాట్లాడుతూ కార్మికులు అంకిత భావంతో పనిచేసి ఉత్పత్తి రికార్డులను సృష్టిస్తున్నారని తద్వారా పరిశ్రమ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతోందని ఆయన వివరించారు. కనుక నేడు ఈ సమస్యను పరిష్కరించడానికి తగిన వెసులుబాటు ఉందని ఆయన అన్నారు. ఆ దిశగా మీరు చర్యలు చేపట్టి కార్మికులను మరింత ఉత్సాహపరిస్తే ఉత్పత్తి ఉత్పాదకతలలో కార్మికుల సామర్థ్యం పెరుగుతుందని ఆయన స్పష్ట చేశారు.
స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన నూతన పెన్షన్ విధానం పై కార్మికులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని, దీనికి నూతన వేతన ఒప్పందం అమలు కాకపోవడం వల్ల తీవ్ర నష్టానికి గురి అవుతున్నారని ఆయన వివరించారు. కార్మికుల ఆర్థిక నష్టాలను తగ్గించవలసిన బాధ్యత యాజమాన్యంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ మాట్లాడుతూ సెయిల్ కార్మికుల నూతన వేతన ఒప్పంధం అమలుతో పాటు వారికి రావలసిన బకాయిలను కూడా సెయిల్ యాజమాన్యం చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులను అధికారులకు ప్రోతహించెందుకు యాజమాన్యం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సి ఎం డి అత్తుల్ భట్ మాట్లాడుతూ నేడు స్టీల్ కార్మికులు కృషి వలన ఉత్పత్తి ఉత్పాదకతల రికార్డు స్థాయిలో వస్తున్నాయని తద్వారా పరిశ్రమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా ఉందని ఆయన అన్నారు. కనుక ఈ విషయంపై స్టీల్ అధికారులతో చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు.