ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ దౌర్జన్యాలను ఎండగడతామని ఈ సందర్భంగా అన్నారు. బుధవారం గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వైసిపి దౌర్జన్యాలను ఎండగడుతూ ప్రజలకు వైసీపీ దౌర్జన్యాలపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గన్నవరంలో టిడిపి నాయకులు పై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తుందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.