ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు వైస్ జగన్ మోహన్ రెడ్డి అశీసులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సీతంరాజు సుధాకర్ కి మద్దతుగా విశాఖ పశ్చిమ ఇంచార్జి ఆడారి ఆనందకుమార్ నాయకత్వంలో బుధవారం జీవీఎంసీ 58వ వార్డ్ పార్టీ కార్యాలయం (శ్రీహరిపురం) నుండి ర్యాలీగా బయలుదేరి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో 58 వార్డ్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య, వార్డ్ అధ్యక్షులు గులిగిందల కృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.