ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ద్విచక్ర వాహనదారుడిని స్థానికులు 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa