ఉలవపాడు మండలం కరేడు పంచాయతీ అలగాయపాలెంలో గల మంజునాథ్ హేచరీలో మంగళవారం ఓ కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఒరిస్సాకు చెందిన దీనబంధు సాహు అతని అన్న ఇద్దరు కలిసి హేచరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. సాహు అన్న 15 రోజుల క్రితం ఇంటికి వెళ్ళాడు. రూమ్ లో ఒక్కడే ఉంటున్న సాహు డ్యూటీ చేసుకోని రూమ్ కి ఉచ్చి బాత్రూంలో వైరుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై త్యాగరాజు బుధవారం తెలిపారు.