గిద్దలూరు నియోజక వర్గం, అర్ధవీడు మండలం కేంద్రమైన అర్ధవీడు పంచాయతీ పరిధిలో అక్కడక్కడ నిలిచిపోయిన మురికి నీరు తాత్కాలికంగా మరమ్మత్తులు చేస్తున్నప్పటికీ కొన్ని చోట్లల మురుగునీటి పారుదల, కాలువల్లో పూడిక,చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.రోజుల తరబడి పూడిక తీయకపోవడంతో మురుగునీరు సరిగా ప్రవహించక ఎక్కడకక్కడ నిలిచిపోతున్నది. చెత్తాచెదారం, కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నదని, దోమల బెడద విపరీతంగాపెరిగిపోతున్నదని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా రోడ్డు తదితర ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్వహణ అధ్వానంగా వుంది. పూడిక తీయకపోగా కనీసం దోమల నివారణకుమందు కూడా పిచికారీ చేయడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువల్లో త్వరగా పూడిక తీయించాలని, దోమల నివారణకు బ్లీచింగ్. మందు పిచికారీ చేయించాలని కోరుతున్నారు.