శ్రీకాకుళం జిల్లా, నందిగాం పరిధిలోని పెద్దబాణాపురం గ్రామానికి చెందిన పైల ఢిల్లెమ్మ అనే ఉపాధి వేతనదారు మెడలో నుంచి పుస్తెలతాడును మంగళవారం గుర్తుతెలియని ఇద్ద రు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్ళితే.... మంగళవారం మధ్యాహ్నం ఇంటి పనులు ముగించుకుని ఉపాధి పనినిమిత్తం హైవేకి వెళ్తుండగా అదే మార్గం నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకుల్లో వాహనాన్ని నడిపే వ్యక్తి ఢిల్లెమ్మకు కొంత దూరంలో నిలుపగా వెనుక ఉన్న మరో వ్యక్తి ఆమె మెడలో ఉన్న సుమా రు రెండున్నర తులాల బంగారం పుస్తెలతాడును బలవంతంగా లాక్కుని వెళ్లి పోయాడు. ఈ సంఘటన నుంచి ఆమె తేరుకునేలోగా బెండి గేటుకు వెళ్లే రాంగ్ రూట్ నుంచి వారు పరారీఅయ్యారు. ఈ మేరకు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహమ్మద్ అమీర్ అలీ తెలిపారు.