భర్తను భయపెట్టాలన్న ఉద్దేశ్యంతో భార్య సోదరుడితో కలిసి దాడి చేసిన ఘటనలో భర్త మృతిచెందాడు. క్షణికావేశంతో జరిగిన ఈ ఘటన మంగళవారం నరసన్నపేట, పెద్దకరగాంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్ళితే..... పెద్దకరగాం గ్రామానికి చెందిన ఇర్రి చంద్రభూషణ్ (35)కు మద్యం తాగే అలవాటుంది. నిత్యం తాగి వస్తూ భార్య భాగ్యలక్ష్మితో గొడవ పడుతుండేవాడు. దీంతో దంపతులిద్దరి మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకునేవి. పెద్దల వద్ద పంచాయితీ కూడా నడిచేది. ఈ క్రమంలో మంగళవారం మద్యం కోసం డబ్బులు అడుగగా ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో భాగ్యలక్ష్మి, ఆమె సోదరుడు శివన్నారాయణలు కర్రతో దాడిచేయడంతో చంద్రభూషణ్ అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించేసరికి మృతిచెందాడు. సమాచారమందుకున్న సీఐ రాము, ఎస్‌ఐ సింహాచలం ఘటనాస్థలానికి చేరుకున్నారు. భర్తను హత్యచేయాలని ఉద్దేశ్యం లేదని.. భయపెట్టి దారికి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుందిన భాగ్యలక్ష్మి పోలీసులకు తెలిపారు. కొన్నాళ్ల కిందట ఎచ్చెర్ల మండలం తోటపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో చంద్రభూషణ్‌కు వివాహం జరిగింది. వీరికి మాధురి, లాస్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మరణించడం, తల్లి జైలుపాలుకావడంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. బేలచూపులు చూస్తుండడం అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa