వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం వెంటిలేటర్‌పై ఉందని మచిలీపట్నం మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో గన్నవరం గన్నవరం వెళ్లకుండా పోలీసులు బాబాప్రసాద్ను హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ కార్పొరేటర్లు అన్నం ఆనంద్, దింటకుర్తి సుధాకర్, నాయకులు అబ్దుల్ అజీమ్, పి.వి. ఫణికుమార్, షేక్ ఫిరోజ్, సుంకర ఏసు, రాజులపాటి శ్రీనివాస్, కొమ్ము దుర్గారావు బాబాప్రసాద్కు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బాబాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. గన్నవరంలో టీడీపీ నాయకులపై కర్రలు, రాళ్లతో వైసీపీ రౌడీలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం మంచిది కాదన్నారు.