మా ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలి. ఆయనకు జరగరానిది జరిగితే డీజీపీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటా’’నని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి సతీమణి కె.చందన హెచ్చరించారు. కోర్టులో హాజరుపరిచి... రిమాండ్‌కు తరలించినప్పుడు ఆయనకు ఏదైనా జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని తన నివాసం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నా భర్తను సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన పోలీసులు తోట్లవల్లూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అక్కడ విద్యుత్ దీపాలు ఆపేసి ముగ్గురు వ్యక్తులు.. ఆయనపై ముసుగు వేసి కొట్టారు. పట్టాభిపై చేయి చేసుకోవడానికి పోలీసులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చీకట్లో కొట్టారు’’ అని ఆరోపించారు.